హంస వాహిని సరస్వతిని చదువుల తల్లి అంటారు. నాలుకకు హంస అనుకుంటే దానిపైన అక్షర రూపిణి సరస్వతిని కొలువుదీరిందని గుర్తుపెట్టుకుంటే అప్పుడు అప్రియమైనవి ఇతరులకు బాధ కలిగించేవి మాటలు పలికే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ప్రియమైనది ఇతరులకు హితం చేకూర్చేది అయిన సత్యాన్నే పలకాలి. శారీరికంగా హింసించటమే హింస కాదు. మాటలతో మానసికంగా హింసించటమూ హింసే. సహనం అలవర్చుకుంటే ఇతరుల దోషాలు కనిపించకుండా పోతాయి. ఆరోపణలు చేసేందుకు నేనెవర్ని అనే ఆలోచనవస్తుంది. మనం ఎలాంటి వ్యక్తిలో తప్పులు వెతకాలనుకుంటే మనకి ఎప్పుడు అవే కనిపిస్తాయి. మానస సరోవరంలో హంసలు ఉన్నాయో లేవో గాని మానవ మనో సరోవరంలో హంసాలుంటాయి. ఆవు పాలు నీరు వేరు చేసినట్లు మనలో ఉన్న చెడును వేరు చేసి మంచినే ఎంచి ఇస్తాయి. ఆ మంచిని అందుకుని చేతులారా ఇతరులకు చేర్చుట ధర్మం.
Categories