ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ  తల్లులు వుండరనే  అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ  వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని తేల్చాయి. పరిశోధనలు. ఎ.వి.పి.ఆర్ 1 ఎ  అనే జన్యువు మంచితనం నిర్దేశిస్తుందట. పిల్లల పైన  పెంచే తల్లి తండ్రులున్నారు. ప్రవర్తన విషయంలో తమ మాటకు కట్టుబడి ఉండకపోతే తల్లులు క్షమించలేరు. భయపెట్టి లేదా దండించి తమ దారికి తెచ్చుకుంటారు. పిల్లలకు అర్ధంకాదని  వాళ్ళు పసివాళ్ళని తెలిసినా అలిగే తల్లులుంటారు. ఇటువంటి తరహా ప్రవర్తన వుండే తల్లులతో ఆ జన్యువు దానికి ప్రతిగా మరో జన్యుభాగం కారణమంటున్నారు. ఇదే జన్యువులను తల్లి పిల్లలకు అందిస్తుంది. ఈ జన్యువులోని భాగాలను  బట్టి తల్లితో కొందరికి విడదీయలేని బంధం వుంటే  మరికొందరు  కొంచెం దూరంగా ఉండటం కనిపిస్తుంది. బిడ్డలలో  మంచితనం అన్నది తల్లి జన్యువు లోంచే అన్న విషయం రూఢీ చేసాయి పరిశోధనాంశాలు.

Leave a comment