కొత్త  పెళ్లికూతుళ్ళూ…శ్రావణ మంగళవారం వచ్చేసింది.మరి మంగళగౌరికి పూజలు మొదలు పెడదామా!!

నోములు నోచేవారికి మరీ సందడి.జ్యోతులు తయారు చేసి, కాటుక పట్టడానికి అన్ని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ఈ నోము అయిదు సంవత్సరాలు క్రమం తప్పకుండా చేయాలి తరువాత ఉద్యాపన తీర్చుకోవాలి.అలా భక్తి గా,శ్రద్ధగా నోచుకుంటే …
“నుదుటి కుంకుమ రవి బింబముగా…
కన్నుల నిండుగా కాటుక వెలుగా..
కాంచన హారము గళమున మెరయగ” అంటూ నిత్య సుమంగళిగా వరాన్ని ప్రసాదిస్తుంది.
మంగళ గౌరీ మీ కోరికలు తీర్చేందుకు వచ్చేస్తుంది.
ఇష్టమైన పూలు:అన్ని రకాలైన పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం.
ఇష్టమైన పూజలు: పసుపు గౌరిని తోరం కట్టుకొని భక్తిగా పూజించడం,ముతైదువుకి తాంబూలం,శనగలు వాయినం,కాటుక ఇవ్వడం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, అరటిపళ్ళు,నానబెట్టిన శనగలు,పొంగలి.

పొంగలి తయారీ:ముందుగా స్వచ్ఛమైన పాలు మరిగిన తరువాత బియ్యం కడిగి అందులో వేసి తగినంత బెల్లం వేసి ఉడికించి చివరికి నేతిలో వేయించిన జీడి పప్పు,కిస్మిస్ వేసి ఘమఘమ లాడే పొంగలి అమ్మవారి సన్నిధిలో నైవేద్యం పెట్టి చల్లని చూపులు తల్లి ఆశీస్సులు అందుకోవడం గమనార్హం.

సఖులందరికి శ్రావణ మంగళ గౌరీ శుభాకాంక్షలు!!

-తోలేటి వెంకట శిరీష

Leave a comment