Categories
అతి బలవంతా…శ్రీ ఆంజనేయ….
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజేహం భజేహం.
సర్వ మంగళాకారుడైన,అతి బలవంతుడైన,శ్రీరాముని పరమ భక్తుడైన,అంజనీ పుత్రుడిని నిత్యం సర్వ వేళల యందు మనస్ఫూర్తిగా నమ్ముకుని పూజించి అనుగ్రహం పొందండి.శ్రీ రామ నవమి ఉత్సవాలు ఆర్భాటంగా ప్రారంభం అవుతున్నయి భద్రాచలంలో.ఈ నవరాత్రులలో ఆంజనేయులవారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈనాడు ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని అంతమొందించటానికి రోజుకి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం మనకు తప్పకుండా సత్ఫలితాలిస్తుంది.
నిత్య ప్రసాదం:కొబ్బరి,అప్పాలు,చిట్టి గారెలు
-తోలేటి వెంకట శిరీష