రంగు,రుచి వాసన తో మనుష్యులను ఆకర్షించే మామిడిని పండ్లలో రారాజు అంటున్నారు. ఈ  తియని మామిడి సౌందర్య సంరక్షిణి కూడా. మొహం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మాయం చేయటంలో మామిడి ఏ ఇతర ఖరీదైన క్రిములకు తీసిపోదు. మామిడి కాయిని ఎండబెట్టి పొడి చేయాలి. దానిలో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొంటే డార్క్ స్పాట్స్ పోయి గోల్డెన్ గ్లో వస్తుంది. ఈ పొడిని నిల్వచేసుకొని వాడుకోవచ్చు. మామిడి పండు గుజ్జులో తేనె కలిపి సర్కులర్ మోషన్ లో మర్దన చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ పోయి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది మొహానికి మిల్క్ క్రీమ్ పట్టించి పండిన మామిడి తొక్కతో నెమ్మదిగా స్క్రబ్ చేస్తే మొహం మెరిసిపోతుంది.

Leave a comment