హాజీ కరీముల్లా ఖాన్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన తోటమాలి ఈయన తోటలో ఒకే మామిడి చెట్టుకు 300 మామిడి పళ్ళు కాస్తున్నాయి కరీముల్లా ఖాన్ 15 ఏటనే తోట పని మీద ఆసక్తితో స్కూలు కి కూడా వెళ్లకుండా మామిడి చెట్ల పెంపకం మొదలు పెట్టాడట.ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన కరీముల్లా కుటుంబీకులు అందరూ తోటమాలులే. ఒకసారి తన మిత్రుని పూల తోటలో ఒకే గులాబీ చెట్టుకు అనేక రకాల వర్ణాలతో గులాబీలు పూయటం చూశాడు చెట్టు కి అంటు కట్టడం గురించి అప్పుడు తెలిసింది కరీముల్లా కు. పండ్ల మొక్కలకు కూడా అదే విధంగా క్రాస్ బ్రీడింగ్ చేయవచ్చు అన్న ఆలోచన తో 1987లో ఆ ప్రయత్నాలు ఆరంభించాడు. అతను పండ్ల అంటు మొక్కలు కట్టే పని లో ప్రపంచ ప్రసిద్ధి పొందారు.ఒకే చెట్టుకు మూడు వందల రకాల ఫలాల చెట్లు అంట్లు కట్టి మూడు వందల రకాల మామిడి పండు కాసేలా అభివృద్ధి చేశాడు. ఒక మామిడి కొమ్మ ని కోసి ఎనిమిదేళ్లపాటు అంటు కట్టడం తో ఇప్పుడా చెట్లు అన్ని రకాల పండ్లనూ ఇస్తోంది. ఒక కొమ్మకు ఒక రూపంలో రంగులు సువాసన తో రుచితో ఉంటాయి.మామిడి పండ్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ చెట్టును గుర్తించింది ఈ చెట్టుకు కాసే పండ్లను కరీముల్లా అమ్మడు ఊరికే పంచుతూ ఉంటాడు.

Leave a comment