సంతోశ్ శివన్ తీసిన తహాన్ సినిమా కాశ్మీర్ అంత అందమైన ప్రాంతం అలగే అందమైన బాల్యం కుడా. తహాన్ ఒక కశ్మీర్ అబ్బాయి. తండ్రిని ఒక కశ్మీర్ మిలిటెంట్ గా అనుమానించి పట్టుకుపోతారు. తాత, తల్లి, అక్క తన స్నేహితుడు బీర్బల్ అంటె ఒక గాడిద ఇదే ఈ అబ్బాయి ప్రపంచం. తాత చనిపోతాడు తల్లి అక్కల జీవితం దుర్భరం అయిపోతుంది. కాశ్మీర్ మిలిటెంట్లకు ఇండియన్ ఆర్మీకి జరిగే నిరంతర పోరాటంలో కశ్మీరి ప్రజల జీవితం పసివాళ్ళ బాల్యం ఇవన్ని సినిమాలో చక్కగా చూపించారు. తహాన్ కోసం ఈ సినిమా చూసేయండి. అనుపమ్ ఖేర్, విక్టర్ బెనర్జీ నటించిన ఈ హింది చిత్రం జమ్ముకశ్మీర్ . బోలెడన్ని అవార్డులు వచ్చాయి ఈ సినిమాకు.

Leave a comment