కర్నాటక అకాడమీ చైర్మన్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా వార్తల్లో నిలిచారు జోగటి మంజమ్మ . కర్నాటక లో జోగతి నృత్యం చేసే ఏకైక బృంద మంజమ్మ దే . మంజమ్మ కర్ణాటక ప్రభుత్వం అందించే ‘రాజ్యోత్సవ అవార్డ్‌’ను 2010లో గెలుచుకున్నారు.. కర్ణాటక ప్రభుత్వం అయిదో తరగతి సిలబస్‌లో, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం బీఎ కోర్సులో మంజమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. కర్ణాటక జానపద యూనివర్శిటీ సహకారంతో 2014లో డాక్టర్‌ చంద్రప్ప సోబటి ‘జోగటి మంజమ్మ’ పుస్తకం రచించారు.  జానపద జోగతి నృత్యం ఆమె జీవితంలో భాగం . ఎన్నో కష్టాలు అనుభవించి అవమానాలు సహించి ఈ స్థాయికి చేరుకొంది మంజమ్మ . ఇప్పుడు రాష్ట్రం మొత్తం ప్రజలు ఆమెను గౌరవిస్తున్నారు .

Leave a comment