పిల్లలు గోళ్ళు కొరుకుతూ ఉంటారు. మొదట్లోనే మాన్పించకపోతే అది కాస్తా జీవితకాలపు అలవాటు అయిపోతుంది. అయితే పిల్లలు ఊరికే కావాలని అలా గోళ్ళు కొరకరు. అతి కుతుహలం ,బోర్ కొట్టటం ,ఒత్తిడి నుంచి ఉపశమనం కొరకు కావచ్చు. ముందు పిల్లల్ని గమనించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలవాటు మాన్పించాలి అంటే కారణం వెతకాలి అంటున్నారు .పిల్లల్లో భయాలు ,అనుభవాలు ,మనోభావాలు తెలుసుకొంటే గోళ్ళు కొరకటం మాన్పించటం సులువే. ఈ అలవాటు తమకి ఉందని ఇది మంచిది కాదని ముందు పిల్లలు గుర్తించాలి. వారు తెలుసుకొన్నాక అది ఎలాంటి చెడ్డ అలవాటో,ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో పెరుగుతున్న కొద్దీ నలుగురిలో అసంకల్పితంగా గోళ్ళు కొరుకతుంటే చూసేందుకు ఎంత అసభ్యతగా ఉంటుందో వాళ్ళకి అర్ధం అయ్యేలా బోధిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

Leave a comment