ఇంట్లో పెంచుకొనే పెరటి తోట కోసం ఇంట్లోని వ్యర్థాలతో నే ఎరువు తయారుచేసుకోవచ్చు అంటున్నారు ఉద్యానవన నిపుణులు. ఈ ఎరువు తయారీ కోసం ఇనుము, ప్లాస్టిక్ డబ్బాలను కంపోస్ట్ బిన్ లుగా వాడుకోవచ్చు.కూరగాయలు పండ్ల వ్యర్థాలు,మొక్కలు కత్తిరించిన గడ్డి కోడిగుడ్డు పెంకులు తేయాకు, పూలు వంటి వాటిని కంపోస్టు తయారీకి వాడవచ్చు. జంతువుల వ్యర్ధాలు రంగుల కాయితాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు ఈ ఎరువు కోసం ఉపయోగించరాదు.  మూడు వంతుల ఎండు వ్యర్ధాలు, ఒక వంతు పచ్చి విత్తనాలు వేస్తే కంపోస్ట్ త్వరగా తయారవుతుంది.ఈ కంపోస్ట్ లో మొక్కలు బలంగా ఎదుగుతాయి.

Leave a comment