ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్ డైట్ చార్ట్ ఇప్పుడు అమ్మాయిలను ఆకర్షించేస్తుంది. ఫిట్నెస్ ఫౌండర్ ఆరుషీ వర్మ ప్రముఖ న్యుత్రిషనిస్ట్ అగర్వాల్ సూచనలు ఖచ్చితంగా పాతిస్తుందట మానుషీ. అల్పాహారం తప్పని సారి. చిన్న ప్లాట్ లో ప్రతి రోజు భోజనం చేయాలి. ఫ్యాట్, షుగర్ వంటివి దగ్గరకు రానివ్వద్దు. పరగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తో పాటు ఓట్స్, తాజా పండ్లు మొలకెత్తిన విత్తనాలు, కోడి గుడ్ల తెల్లసొన, ఆకాడో తో తీసుకుంటాను.  క్యారెట్, బీట్ రూట్, స్వీట్ పోటాటో బ్రేక్ ఫాస్ట్ లో ఉండేలా చూస్తాను. మధ్యాహ్నం కొబ్బరినీళ్ళు , పళ్ళు. లంచ్ లో రైస్ లేదా చపాతీ, చికెన్, కూరగాయల ముక్కలు సాయంత్రం ఉప్పు లేకుండా నట్స్ అరటి పండు, రాత్రికి డిన్నర్ లో కాల్చిన చేప కూరగాయలు ఇదే నా ఆహారం అంటుంది ప్రపంచ సుందరి మానుషి.

Leave a comment