Categories
స్త్రీలంటే అపర శక్తి స్వారూపాలు .పని విషయంలో స్త్రీ పురుషుల తేడా ఉండదు. ఆకాశమే హద్దుగా దూసుకుపోవటం మాకు తెలుసు అంటారు వి.ఆర్ లలితాంబిక. 2022వ సంవత్సరంలో నిర్వహించనున్న మనుష్యులతో అంతరిక్ష ప్రయాణపు ప్రాజెక్ట్ కు ఆమె నాయకురాలు .స్పేస్ మిషన్ లో గత 30 ఏళ్ళుగా పని చేస్తుందామే. ప్రస్తుతం డైరక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్ట్ లక్ష్యాన్ని ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే అందుకున్నాయి. లలితాంబిక నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ 2022 లక్ష్యంగా ముందుకు నడుస్తోంది.