వంటరితనం ఎప్పుడూ ఆరోగ్యకరం కాదు అంటున్నాయి అధ్యయనాలు. అసలు మనిషి ఆలోచించే విధానంలో పది మందితో కలిసి జీవించే పద్ధతి ఉంది. మనిషికి స్నేహం కావాలి. ఆదరణతో నిండిన పలకరింపు కావాలి. ఊరటనిచ్చే మానవ స్పర్శ కావాలి. అసలు చుట్టు మనుషులే ఉండాలి. రకరకాల వయస్సుల్లో ఉన్న 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో వాళ్ళ ఆరోగ్యంపైన ఒంటరి తనం ప్రభావం పైన సర్వే నిర్వహిస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎన్ని సౌకర్యాల మధ్య జీవిస్తున్నప్పటికీ ఆరుదుగా డిప్రెషన్ లతో నే ఉన్నారని తేలింది.నాణ్యమైన జీవన విధానం కనబడనే లేదని ,ముఖ్యంగా పురుషులు ఒంటరిగా ఆరోగ్యంగా జీవించలేదని తేలింది.

Leave a comment