కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థ ఎలా మారుతోందో నేను చెప్పలేను గానీ సామజిక జీవనం మాత్రం తప్పని సరిగా మారిపోతుంది. భౌతిక దూరం జీవితంలో భాగమైపోతుంది నలుగురితో కలిసి తిరగాలన్న మాట్లడాలన్న భయం బెదురు ఉంటాయి. ఇక విందులు,షికార్లు గురించి అయితే ఒక్కటి పది సార్లు ఆలోచిస్తారు అంటున్నారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధ మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరఫున 120 కోట్ల మేరకు కోవిడ్ సమయంలో సహాయం అందించిన సుధ మూర్తి అక్షయ పాత్రకు 10 కోట్లు అందించారు ఉపాధి పోయి అనాదలైన వాళ్ళకి తినేందుకు అన్నమైన దొరుకుతుందని ఆశపడుతున్నారు అంటున్నారు సుధ మూర్తి.

Leave a comment