లాక్ డౌన్ తో అందరూ ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. ఇరవై నాలుగు గంటలు నాలుగు గోడల మధ్యన కదల కుండా కూర్చోవటం  పిల్లలకు కష్టమే.  ఈ సమయంలో పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పండి. అంటున్నారు ఎక్స్పర్ట్స్.  వైరస్ వ్యాప్తి దాని వల్ల జరిగే అనర్థాలు మరీ భయ పెట్టకుండా వివరించి వాళ్లకు ఒక  జీవన విధానానికి తయారు చేసే సమయం ఇలా దొరికిందను కోవాలి. వాళ్ళని వంటింట్లో సాయం చేయనివ్వాలి. ఇళ్లల్లో శానిటైజర్లు ఆడుకునే ఆటలు వైకుంఠపాళి , అష్టాచెమ్మా వంటివి కూడా వాళ్లకు నేర్పవచ్చు. శానిటైజర్లు తయారు చేయించటం వంటివి ప్రోత్సహించి వాటిని అవసరమైన వాళ్లకు ఇచ్చేలా చేయండి. ఇలాటి పనులలో వాళ్లలో పరోపకార బుధ్ధి ఏర్పడుతుంది.

Leave a comment