Categories
ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఏవో మరకలు బట్టలపైన పడుతూనే ఉంటాయి. ఒక్కసారి అవి బట్టలపై ఆరిపోయాక డ్రై వాష్ కు వేసిన పోనంత మొండి మరకలవుతాయి. వాటిని వెంటనే క్లీన్ చేస్తేనే మరకమాయం అవుతుంది. కారు డోర్ తగిలినా గ్రీజు మరకలు అయిపోతాయి.మరక కనబడిన వెంటనే టాల్కం పౌడర్ చల్లి నీళ్ళు చల్లి ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా తుడిస్తే మరకలు పోతాయి. టీ,కాఫీ మరకలు వేడి నీటిలో స్పాంజ్ ముంచి తుడిచేయాలి. బిస్కెట్ మరకలని చల్లని నీటిలో స్పాంజ్ ముంచి అణిచిపెట్టాలి గట్టిగా తూడిస్తే పోతాయి. ఇక బురద మరకలైతే నీళ్ళు వదులుతూ పోయే వరకు బ్రెష్ చేస్తుండాలి. గమ్ మరకలను ఆల్కహాల్ తో తుడవాలి. ఆల్కహాల్ మరకలను సోడా నీటితో రుద్దేస్తే పోతాయి.