ఈ సీజన్ అంతా కాటనే .ఎండ ప్రభావం లేకుండా మెత్తని నూలు దుస్తులు వాడటానికి అందరూ ఇష్టపడతారు. కాస్త తేలికైన రంగులకే ప్రాధాన్యత ఇస్తారు. వాటి పైన చిన్న మరక పడినా చూసేందుకు కొట్టాచ్చినట్లు కనిపిస్తుంది. హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటార్జెంట్ ఒక భాగం నీరు కలిపి పేస్ట్ లాగా చేసి శుభ్రమైన టూత్ బ్రెష్ తో ఈ పేస్ట్ ను మరక పడిన చోట రాయాలి.రుద్దటం వల్ల కాటన్ ఫ్యాబ్రిక్ లోకి మరింతగా మరక చోచ్చుకుపోతుంది. అంచేత కోద్దీసేపు అలా ఉంచి చేత్తో నులిమెస్తూ ఉతకాలి.ఫ్యాభ్రిక్ తట్టుకోనే గుణం కలది అయితే వేడి నీళ్ళతో ముంచవచ్చు. మరక అలాగే ఉంచి ఎండలో ఆరవేస్తే ఇక నూలు పైన అలాగే ఉండి పోయే ప్రచారం కూడా ఉంది.

Leave a comment