కొత్తగా కొన్న వాహనాలకు నిమ్మకాయలు ,మిరపకాయలు కట్టడం ,ఇంటికి దిష్టి తగులుతోందని గుమ్మడికాయలు ,రాక్షసుల బొమ్మలు తగిలించడటం చూస్తూవుంటాం.  మూఢ నమ్మకాలే ఇవి. లాజిక్ కు అందని విషయాలు. ఇలాంటి నమ్మకాలు మనుష్యులను ప్రమాదంలోకి నెడతాయి. ఒక ఇంటర్యూకి, పరీక్షకు ఫలాన రంగు పెన్ తీసుకుపోవాలనొ, అచ్చోచ్చిన పెన్ అని తీసుకుపోతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు అది పోతే మానసిక ధైర్యం పోయి వెళ్ళిన పని విజయవంతంగా నెరవేర్చలేకపోతారు. ఎవరైన ఎదురొస్తే, ఫలాన రంగు దుస్తులు వేసుకొంటే , ఫలానా నగ పెట్టుకొంటే పనులు కావు ఆ పనులు చేసే శక్తి మనలో ఉంటే ఆ పనులు నిరభ్యంతరంగా పూర్తవుతాయి. ఎప్పుడు మూఢ నమ్మకాల వలలో పడోద్దు.

Leave a comment