డెనిమ్ డ్రెస్ లో ఎప్పుడు బావుంటాయి. నీలి,గోధుమ,నలుపు కలయికతో ఎన్నో డిజైన్ లతో డెనిమ్ చుక్కలు కుర్తీలు వస్తున్నాయి. మోకాలి వరకు ఉండే డెనిమ్ కుర్తీలు ఎంచుకోంటే మడమ వరకు ఉండే లెగ్గింగ్స్ చాలా బావుంటాయి. స్టైల్ కట్ లేదా అంబ్రెల్లా రకాలు ఎంచుకోని చక్కని ఫ్యాన్సీ బెల్ట్ పెట్టుకొంటే మరింత అందంగా కనిసిస్తారు. రకరకాల డెనిమ్ టాప్ లపై ఎంబ్రాయిడరీ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డెనిమ్ వస్త్రాలపైకి పెద్ద అలంకరణ కూడా అవసరం లేదు. చిన్న చిన్న స్టడ్స్ సన్నని బోకర్లు బావుంటాయి. సాయంత్రం పార్టీలకు ఈ డెనిమ్ వస్త్రాలు ఎంతో చక్కగా నప్పుతాయి.

Leave a comment