సాధారణంగా అమ్మాయిలు ఆఫీస్ వేర్ గా చుడీదార్ లు కుర్తీ లెగ్గింగ్ లే వేసుకొంటారు. రోజు అవే వేసుకోవటంతో రోటీన్ గా ,ఫ్యాషన్ లుక్ లేకుండా అయిపోతూ ఉంటుంది. వీటినే కాస్తా డిఫరెంట్ గా వాడవచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్స్. లెగ్గింగ్స్ ,కుర్తీలు జతగా కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు.బాటమ్ లు సాధారణ రకాలకంటే యాంకిల్ లెంగ్స్ లెగ్గింగ్స్ ప్యార్లర్,సిగరెట్ ఫ్యాంట్లు ట్రైయ్ చేయవచ్చు. మరీ గడీగా ఉండకుండా లేతరంగులలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు అన్ని రంగులకు పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి. అప్పుడు రంగు అయినా అన్ని రకాల ఫేడ్స్ లో తీసుకోవచ్చు. కుర్తీ సాదాసీదాగా ఉంటే ప్రింటెడ్ ప్యార్లర్ ఫ్యాంట్లు ,కుర్తీ మడమ వరకు ఉంటే లెగ్గింగ్స్ జత చేసుకోవచ్చు. చక్కని షూలు,చెవులకు పెద్ద రింస్స్ మార్చిమార్చి ఎంచుకొంటే బావుంటాయి.

Leave a comment