Categories
Nemalika

మరీ డీప్ గా వెళ్ళకపోతే చాలు.

నీహారికా,

ఒక కొత్త ప్రదేశాలోకి వెళితే నలుగురితో కలిసి పోవడం ఎలా అన్నావు. ఏముందీ మొట్ట మొదట కాలేజీలో అడుగు పెట్టినప్పుడు ఎలా వుంటుంది. చుట్టూ ఎంత మంది వాళ్ళతో బెరుకు బిడియం వదిలి పెట్టి స్నేహంగా మాట్లాడి కలిసిపోము అలాగే. మన లాగే మిగతా వాళ్ళకి కొత్త చూటు ఇబ్బందిగానే వుంటుంది. అమనం మాత్రం కాస్త ఓ అడుగు ముందుకు వేయకూడదు? మీరు ఎక్కడ నుంచి పేరేమిటి? వంటి చిన్ని చిన్ని ప్రశ్నలతోనే మొదటి అడుగు వేస్తాం కదా అదే స్నేహంచేయడం మనం చక్కగా నవ్వుతూ చుస్తే అవతలి వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. అయితే ఖచ్చితమైన హెచ్చరిక. ఈ పరిచయంలో వెంటనే అవతలి వాళ్ళను సవాలక్ష ప్రశ్నలు వేసేసి, పెళ్ళయిందా పిల్లలా, మీవారేమిటి? మీ అత్తాగారు మీతో బావుంటుందా? ఇవన్ని అక్కర్లేదు. అది పెళ్ళో పెరంటమో అయితే వున్న గంటా మనకి నచ్చిన ఏ విషయం గురించి అయినా మాట్లాడితే చాలు. మనకు పాలిటిక్స్ ఇష్టం అయితే ఒకటి రెండు ప్రశ్నలతో అవతలి వాళ్ళకు అభిరుచి వుందో లేదో తెలుస్తుంది. ఇక పాలిటిక్స్ వదిలేసి రోజు వారి వ్యవహారాలు మన చుట్టూ దొరికే వస్తువులు, అందరికి ఉపయోగ పడే వస్తువులో ఎదో ఒకటి అవతలి మనిషికి ఇచ్చింది కలిగించని సంభాషణ తో ముగిస్తే సరిపోతుంది.

Leave a comment