Categories
జపాన్ లో పండ్ల ధరలు వేలు , లక్షల్లో ఉంటాయి . ఇవి కానుకగా ఇచ్చేందుకు ఎంచుకొన్న ఫలాలు . ఇవి మాములు ఆకారంలో ఉండవు . పుచ్చకాయ హృదయాకారంలో స్ట్రాబెరీలు టెన్నిస్ బాల్ సైజ్ లో ,ద్రాక్షాపండు ఎర్రని ఆకారంలో ఒక్కోటి చిన్న సైజు టమాటల్లాగా ఉంటాయి . ఈ ఎర్రని రూబీ రోమన్ గ్రేప్స్ పండించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు . ఇలా వివిధ ఆకారాల్లో ,వివిధ రోజుల్లో పండించేందుకు ఎంతో శ్రమ,కష్టం ఉంటుంది సేంద్రియ పద్దతిలో పండించిన పండ్లను వేల ఖరీదుకు కొని కానుకగా ఇస్తూ ఉంటారు . వీటిని బంగారు ఆభరణాల్లాగా చక్కని పెట్టెలో పెట్టిమరీ ఇస్తారు .