పెళ్లి అనగానే ఎప్పుడు వధువే చక్కని రత్నాలు ఆభరణాలతో వెలిగి పోవటం కనిపిస్తుంది .మరీ అంత అలంకరణతో వధువు మెరుస్తూ ఉంటే పక్కనే వరుడు వేలవేల పోతే ఎలా ? అందుకే ఈ మధ్యకాలంలో వరుడి అలంకరణలో కూడా నగలు భాగం అవుతున్నాయి .వరుడి మెడలో చంద్రహారం వేసే సాంప్రదాయం ఉండేది .ఇప్పుడు ఆ సంప్రదాయం కొనసాగుతోంది .సదా చంద్రహారం వేసిన దానికి ఎమరాల్డ్, పెండెంట్ ఉంటే మరింత శోభాయమానంగా ఉంటుంది. అంత భారీ ఆభరణం వద్దనుకుంటే చక్కని ముత్యాల మాలలు నాలుగైదు వరసలు వేసుకున్నా బాగుంటుంది . దీనికి కుందన్  అన్ కట్ మోజ నైట్ తో మరింత అందంగా చేయించుకోవచ్చు .వరుడికి పెళ్లిలో తల తలపాగా పెడతారు ఈ తలపాగా కు Sarpech Turban Ornament తగిలిస్తే వరుడు హుందా గా పెళ్లి కళ తో కనిపిస్తాడు. ఈ ఆభరణం బంగారం, డైమండ్స్, అన్ కట్  కుందన్ లలో దొరుకుతోంది.పెళ్లయ్యాక ఈ ఆభరణం వృధాగా పడేయ వలసి వస్తుందనే బాధ లేదు ఇదే సర్ పేంచ్ ను వధువు లాకెట్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పెళ్లి ముస్తాబులో వరుడి చేతికి ఒక కాడా లేదా కడియం హుందాతనం తెచ్చిపెడుతుంది .ఇదే కడియాన్ని పెళ్లి తర్వాత క్యాజువల్ జ్యువెలరీ గా వాడుకోవచ్చు అందంగా చక్కని పనితనంతో ఉండే కడియం అమ్మాయిలు ధరించిన బావుంటుంది .

Leave a comment