Categories
పది నిముషాల ముందు టేబుల్ పైన తాళం చెవులు గుర్తురావు. ఆఫీస్ హడావుడిలో వుంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టామో ఒక పట్టాన గుర్తు రావు. ఎందుకిలా ? పాతికేళ్ళు దాటకుండానే మతి మరుపు వస్తోందేమిటి ? అనుకుంటారు. ఈ జ్ఞాపక శక్తి తగ్గుదల వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలకు పిల్లలకు వస్తోంది. జ్ఞాపక శక్తి మెరుగుపడాలంటే ఆరోగ్యపు అలవాట్లలో కొద్దీ మార్పులు చేసుకోవాలి. కాల్షియం ఎక్కువగా లభించే పాలు చీజ్,బట్టర్ పెరుగు వంటివి మెదడు చురుకుదనానికి దోహదం చేస్తాయి. క్యాబేజీ,కాలిఫ్లవర్ కొత్తిమీర ఉదయాన్నే ఉప్పు జల్లి తింటే మెదడు చురుగ్గా ఉంటుంది. భోజనం తర్వత మజ్జిగ తాగితే ఆందోళన వత్తడి తగ్గుతాయి జ్ఞాపక శక్తి పై వాటి ప్రభావం ఎక్కువ.