ఏ జనం మధ్యనో ఎండలో కాసేపు నిలబడితేనో హాటాత్తుగా వంగి లేస్తేనో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కాలు పై కాలుని ఎక్స్ ఆకారంలో వేసి కూర్చుని గట్టిగా నొక్కి పట్టాలి. అలాగే చేతులను కూడా ఎక్స్ ఆకారంలో వేసుకుని గట్టిగా భిగిస్తే రక్త సరఫరా వేగవంతమై మెదడుకి ఆక్సిజన్ అందుతుంది. మెదడుకి ఆక్సిజన్ అందకపోతే స్పృహ తప్పుతుంది. ఆస్టర్‌ డామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ ఎక్స్ చిట్కా తప్పక పని చేస్తుందని మెదడుకు వెంటనే ఆక్సీజన్ సరఫరా జరుగుతుందని గుర్తుంచుకోమంటున్నారు. అలాగే ఆగకుండ ఎక్కిళ్ళు వస్తూ వుంటే గొంతుకు అటు ఇటు రెండు ఐస్ క్యూబ్స్ పెడితే నరాలు సాంత్వన పొంది ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

Leave a comment