Categories
WoW

మారిన త్రిపుర గ్రామీణ చిత్రం.

మన దేశంలో వెదురు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. త్రిపుర ప్రజల సామాజిక, ఆర్ధిక సాంస్కృతిక విషయాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 21 రకాల వెదురు పెరుగుతుంది. దీనితో గ్రామీణ ప్రాంత మహిళలు లాంప్స్, బుట్టలు, పర్సులు, పడక కుర్చీలతో పాటు ఇంట్లో వాడుకునే ఎన్నో రకాల ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. వెదురు వారి జీవితాల్లో వెలుగు నింపింది. ఇక్కడ తయారయ్యే వెదురు ఉత్పత్తులను చాలా ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గ్రామీణుల సామర్ధ్యాన్ని పెంచడం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా త్రిపుర బాంబూ మిషన్ వారికి శిక్షణ ఇస్తుంది. సంప్రదాయ హస్త కళాకారులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త డిజైన్లను నేర్పిస్తున్నారు. ఇక్కడి పేదల ఆర్దిక పరిస్థితులు చక్కబరిచేందుకు ప్రభుత్వo తీసుకున్న కార్యక్రమాల్లో ఇదొకటి. గ్రామీణ మహిళలకు ఆర్ధిక స్వావలంబన కలిగింది ఈ వెదురు పరిశ్రమ వల్లనే.

Leave a comment