నెక్లెస్ , చెవి దిద్దులు ముఖాకృతికి నప్పేలా ఉండాలి.  ఆప్పుడు మొహం ఓవెల్ షేప్ లో ఉంటే అన్నీరకాల స్టయిల్ నెక్లెస్ లు బావుంటాయి. ఇయర్ రింగ్స్ , హూప్స్ షాండ్లియర్స్ బావుంటాయి. హార్ట్ షేప్ ముఖాకృతి గనక అయితే షార్ట్ నెక్లెస్ లు కర్వ్ లతో ఉన్నవి బావుంటాయి. కాలర్, ఇయర్ రింగ్స్, హూప్స్ టియర్ డ్రాప్స్ ,  ట్రయాంగిల్స్ చక్కగా నప్పుతాయి. ఇక డైమాండ్ షేప్ ముఖాకృతికి నెక్ లైన్ జ్యూయలరీ స్టైల్ నప్పుతుంది. ట్రయాంగిల్స్, కట్ క్రిస్టల్స్ ,హూప్స్ ముఖం అందాన్ని సున్నితంగా చక్కగా చూపిస్తాయి. బ్లాంగ్ షేప్ మొహం అయితే మెడకు అంటిపెట్టుకునే నగలు ఎంచుకుంటే ముఖం సన్నగా కనిపిస్తుంది. పెద్దవి బోల్డ్ ఇయర్ రింగ్స్ చక్కగా వుంటాయి.

Leave a comment