ఝాన్సీ రాణి జీవిత కథను “రాణి కర్ణిక” గా తెలుగు లో నిర్మిస్తున్నారు. ఇందులో రాణికర్ణికగా కంగనా రనౌత్ నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంది. పద్మావత్ చిత్రంలో లాగా రాణికర్ణిక చిత్రం వివాదాల్లో చిక్కుకుంది.ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్రని వక్రీకరించారని సర్వ బ్రాహ్మణ మహా సభ సభ్యులు ఆరోపిస్తున్నారు. జై మిశ్రా రాసిన వివాదాస్ప‌ద పుస్తకం రాణీ ఆధారంగా మ‌ణిక‌ర్ణిక తెర‌కెక్కిస్తున్నార‌ని సభ్యుల అనుమానం. కానీ వివాదాల సంగతి ఎలా ఉన్న ఎప్పుడు మోడ్రన్ డ్రెస్ లో కనిపించే కంగనా ఇవాళ రాణికర్ణిక గా కొత్త లుక్ లో అద్భుతంగా ఉంది.

Leave a comment