పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు మన దేశంలో. కొంత మంది మార్జాల ప్రేమికులు ఉన్నారనుకోండి. కానీ ఈజిప్ట్ లో మాత్రం పిల్లిని ఏకంగా దైవంగా కొలుస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టియన్లు పిల్లిని తమ రాజసానికి ప్రతీకగా భావించేవాళ్ళు వాటిని అత్యంత పవిత్రంగా చూస్తారు. ఎవరింట్లో పిల్లి వుంటుందో వాళ్ళని అదృష్టవంతులుగా అనేవాళ్ళు కాస్త ధనికులైతే పిల్లిని ప్రత్యేకమైన ఆభరణాలతో అలంకరించి కూడా తీసుకుపోయేవారు. పిల్లులు మరణిస్తే తమ కుటుంబ సభ్యులు పోయినంత గా బాధపడతారు. ఎక్కడైనా ప్రమాదం జరిగి పిల్లి మరణిస్తే ఆ ప్రమాదానికి కారకులైన వారికి మరణ శిక్ష కూడా ఉండేదట!

Leave a comment