అందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు!!
ఈ రోజు పోచంపల్లిలో వున్న మార్కండేయ క్షేత్రం గురించి చెప్పుకుందాం. నవ బ్రహ్మలలో ఒకరైన భృగు మహర్షి.వారి సంతానంలో ఒకరైన మృకుండ మహర్షికి సంతానము లేక భార్యతో శివారాధనకు బయలుదేరి వెళ్లారు.వారి పూజలకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఙ్ఞాని అయిన అల్పాయుష్కుడు కావలెనా లేక అఙ్ఞానియై దీర్ఘాయుష్మంతుడు కావలెనా అని అడుగగా ఙ్ఞాని అయిన బాలుడే అని సెలవిచ్చారు.ఆ బాలుడే మార్కండేయుడు.
దేవతలు తగు వస్త్రములు లేక బ్రహ్మని వేడుకొనగా మార్కండేయునికి ఆదేశించిన అగ్నిలో నుంచి భువన ఋషి ఉద్భవించి బ్రహ్మ సింహాసనమైన తామరపూవ్వు నారతో వస్త్రాలు చేసి “పద్మశాలి” అని బిరుదు లభించింది.పోచంపల్లి దేవాలయంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.శివారాధన చేసి మృత్యుంజయుడుగా భక్తులకు దర్శనం ఇస్తారు మార్కండేయయలవారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment