నీహారికా,

ఈ రోజు నవంబర్ 14 బాలల్ దినోత్సవం మనం ఈ ఉత్సవాలు అలవాటుగా జరుపుకుంటాం కానీ ఉత్సవం వెనుక వున్న ఆశయాన్ని తెలుసుకునే వున్నామా అనిపిస్తుంది. మనందారం  బాల్య దిశ దాటి వచ్చిన వాళ్ళమే. ఇప్పటికీ మధురమైన జ్ఞాపకాలు అంటే గుర్తున్నంత వరకు చిన్నప్పటి సంగతులే పిల్లలకు చెప్పుతాం. కానీ మనం కళ్ళ ముందు ఎదిగే పిల్లల మనస్సు తెలుసుకునే ప్రవర్తిస్తామా? పసి పిల్లలు పూల తోటల్లోని మొగ్గల్లాంటి వాళ్ళు, వాళ్ళని ప్రమగా సాకాలి అంటారు నెహ్రు. చిన్నపిల్లలా వల్లనే మనం ప్రేమ సూత్రాన్ని అర్ధం చేసుకోగలుగుతాం అంటారు మహాత్మా. పిల్లలే ప్రపంచం లోని అత్యంత విలువైన వనరులు. బంగారు భవితకు వారే పునాదులు అంటారు ఎందుకొ  మహానుభావులు మరి మనం సొంత జ్ఞానాన్ని పిల్లల పైన ఎందుకు ప్రయోగించడం. వాళ్ళని స్వేచ్చగా వాళ్ళ ఇస్టాలు ఎందుకు చెప్పనీయం? చెపితే అవి ఆచరణలోకి ఎందుకు రానీయ? ఇవన్నీ గనుక తల్లి దండ్రులు వేసుకుంటే, పిల్లలు వాళ్ళనుకున్న జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ ఎదిగే ఎంతో మేధావులు అయ్యే వాళ్ళు. వాళ్ళని అనవసరంగా మన విద్యా విదానంలోని దుర్మార్ఘమైన మార్కుల చట్రంలోని తెచ్చి బిగిస్తున్నాం. ఈ ఇంజనీరింగ్ లు, ఐటీ లను కాసేపు వదిలేసి, వాళ్ళను అమెరికా రవాణా చేయడం పక్కన పెట్టి అసలు మన పిల్లల్ని సొంత , మంచి కళ్ళతో చూసి వాళ్ళ కిష్టమైన పనికి ప్రోత్సహిస్తే ఎలా వుంటుంది?

Leave a comment