పర్యావరణం కాపాడాలని ఎంతో మంది ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు . అలాటిదే ఇదో కొత్తరకం ప్రచారం . చెట్టును పెళ్లిచేసుకోవడం .ఈ నినాదంలో ఒక వినూత్నమైన కార్యక్రమం మొదలైంది . అత్యంత ఎక్కువ వయస్సున్న చెట్లను పెళ్ళాడి దాని బాగోగులు బుజాన వేసుకోవటం . పెరూ కి చెందిన రిఛర్ట్ టోర్రెస్ చెట్టుని పెళ్ళడండి ప్రాణవాయువు కాపాడుకొండి అనే నినాదంతో వృక్షాన్ని పెళ్లిచేసుకొన్నాడు . ఈ పెళ్ళి మేళ తాళాల మధ్య అతిధుల మధ్య జరిగింది . ఈ వేడుకకు ఎంతోమంది పర్యావరణ వేత్తలు ,స్థానికులు హాజరయ్యారు . ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరకివేతను అరికట్టే లక్ష్యంతో తన కాంపెయిన్ ను పెరూ అర్జెంటీనా ,కొలంబియా దేశాల్లో ప్రారంభిచాడు రిఛర్ట్ .

Leave a comment