ఇరాన్ లో ఒక మారుమూల మఖునిక్ అనే ఒక కుగ్రామం ఉంది . ఈ గ్రామం లో అందరూ సాధారణ ఎత్తు కన్నా అరమీటర్ తక్కువ ఉంటారు . మాములు ఎత్తుకన్నా పొట్టిగా ఉంటారు . వీళ్ళ కు తగ్గట్టు గానే ఇళ్ళు నిర్మించు కొంటారు . ఇక్కడి వాతావరణ పరిస్థితి ని బట్టికూడా చిన్న ఇళ్లయితే ఎండా ,చలి సమంగా ఉంటుంది . పోషకాహార లోపం ,నాగరిక ప్రపంచానికి దూరంగా జీవించడం ,బయటి వాళ్ళతో బాంధవ్యాలు లేక పోవడం తమలో తామే వివాహాల చేసుకోవడం వల్ల ఇలా ఎత్తు తక్కువగా ఉన్నారని జన్యు లోపలే కారణమని అంటున్నారు పరిశోధకులు ఇప్పుడిప్పుడే వాళ్ళు బయట వాళ్ళ తో కలుస్తున్నారు .

Leave a comment