మానసిక వ్యాధుల్లో సగం వ్యాధులు 14 సం|| ముందుగానే కలుగుతున్నాయి యువతలో కలిగే వ్యాధుల్లో డిప్రషన్ 3వ స్థానంలో ఉంది . 15 సం|| మధ్య వయసు వారిలో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకొంటున్నారు . మద్యానికి ,మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం తోపాటు రకరకాల మానసిక వ్యాధులు ,ప్రవర్తన సమస్యలు తలెత్తడమే కాకుండా ,విచక్షణ రహితంగా మోటారు వాహనాలు నడపడం,ప్రాణాలమీదకు తెచ్చు కోవడం ఉంటుంది ,దానితో మధుమేహం ,రక్తపోటు వంటి అనారోగ్యకరణాలకు గురవుతున్నారు . యువతలో మానసిక ఒత్తిడికి ఈ నటి విద్యావిధానమే కారణం అవుతుంది . అన్నింటిలోనూ వేట ఎక్కువ అయి ,కోరుకొన్నది పొందలేక కుంగుబాటుకి లోను అవుతున్నారు . సోషల్ మీడియా అతిగా అలవాటు పడటం ,రకరకాల మానసిక సమస్యలు కలుగుతున్నాయి . సమస్యలు ఎదురైనప్పుడు,వాటిని పరిష్క్రించుకొనే విధానము తెలియక పోవడం వలన డిప్రషన్ కు లోను అవుతున్నారు . తల్లిదండ్రులు పిల్లలు చదువుకు అతిగా ఖర్చు పెడుతున్నారు తప్ప ,వాళ్ళకు కావలసిన సమయం ,ప్రేమ పంచడంలేదు. ప్రేమ రాహిత్యం వల్ల కూడా పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. వీటితో మానసిక కృంగుబాటుకు లోనవుతున్నారు.

కే.వినోద్ కుమార్,క్లీనికల్ సైకాలజిస్ట్

సెల్: 9398141041

Leave a comment