కరోనా కష్ట సమయంలో మాస్క్ లు కుట్టి  ఉచితంగా ఇద్దామనుకున్నారు. ఢిల్లీకి చెందిన తల్లీకొడుకులు లక్ష్మి సౌరవ్ దాస్. ఈ ఇద్దరూ కలిసి ఈ రెండు నెలల్లో ఉచితంగా వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు. మాస్క్ డిస్పెన్సరీ బాక్సులు ఏర్పాటు చేశారు. 2000 మాస్క్ లు రైతులు ,స్థానిక మార్కెట్లోని  దుకాణాదారులు రిక్షా పుల్లర్స్, ఇతర కార్మికులకు అందేలా మాస్క్ బాక్స్ లు తయారు చేసి పెట్టేశారు. ఒక్క పెట్టెలో 30 మాస్క్ లు  ఉంటాయి.పెట్టి బయటికి వేలాడుతున్న రిబ్బన్ లాగితే ఒక్క మాస్క్ బయటికి వచ్చేలా ఈ మాస్ డిస్పెన్సరీ బాక్స్ లు తమ నివాస ప్రాంతం చుట్టూ పెట్టేశారు. ఒక్క మాస్క్ తీసుకోండి,సురక్షితంగా ఉండండి.అన్న స్లోగన్ ఈ డిస్పెన్సరీ బాక్సుల పైన రాసి పెట్టారు.ఈ తల్లీకొడుకులు ఈ మాస్క్ లు ఎంతో మంది చక్కగా ఉపయోగించుకోంటున్నారు.

Leave a comment