కరోనా  భయంతో  మాస్క్ లు తప్పని సరి.అలాంటప్పుడు వాకింగ్,జాగింగ్ లకు మాస్క్ లు పెట్టుకోవడం మంచిదేనా అని చాలామంది సందేహం. సాధారణంగా మాస్క్ లు మంచివే  అంటున్నారు ఎక్స్పర్ట్స్. కానీ వ్యాయామం లో అధిక శ్రమ వల్ల మాస్క్ తో తగినంత ఆక్సిజన్ అందకుండా పోతుంటుంది.అందువల్ల జనసామాన్యానికి కాస్త దూరంగా మాస్క్ లేకుండా వ్యాయామం చేయటమే బెస్ట్.  తేలికపాటి నడక నడిచే వారు ఇంట్లోనే అవసరమైనంత సేపు మాస్క్ లేకుండానే నడిస్తే మంచిది. సరైన మోతాదులో ఆక్సిజన్ అందక పోతే తల దిమ్ముగా ఉండడం ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు ఉంటాయి జాగ్రత్త అంటున్నారు.

Leave a comment