ముఖానికి మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి చర్మం యవ్వన వవంతంగా ఉంటుంది. వయసుతో పాటు వచ్చే ముడతలు త్వరగా రావు. నెమ్మదిగా ముఖానికి మసాజ్ చేస్తే పూర్తిగా టోన్ అవుతుంది. వలయాకారంలో పైనుంచి క్రిందకు మసాజ్ చేయాలి మసాజ్ చెయ్యటం అంటే ముఖం పైన మలినాలు తొలగించటమే. అలాగే రబ్బింగ్ చేసేప్పుడు కూడా నెమ్మదిగా వేళ్ళతో ముఖం పైన మసాజ్ లాగా చేస్తే మృతకణాలు మురికి నల్లమచ్చలు వదులుతాయి. వంటగదిలో ఉండే పదార్థాలతో పండిన పండ్లతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే చర్మం యవ్వనవంతంగా మారిపోతుంది శరీరానికి మసాజ్ చేస్తే ఎంత రిలీఫ్ ఉంటుందో ముఖానికి చేసే మసాజ్ తోనూ చర్మానికి అంత రిలీఫ్ ఉంటుంది.

Leave a comment