పరమేశ్వరుని మానస పుత్రిక అయిన మానసదేవికి నమో నమః.

ఉత్తరాఖండ్లోని హరిద్వార్ దగ్గర బిల్వపర్వతం పైన కొలువు తీరి వున్న అమ్మవారి సన్నిధిలో  పూజలు చేసి ముక్తి పొందడానికి తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు భక్తులు.
మానస దేవి సోదరుడు వాసుకి.జరత్కార మహర్షికి మానస దేవికి వివాహం జరిగి,అస్తీకుడు జన్మించాడు.జనమేజయుడు సర్పయాగం తలపెట్టిన భూమండలంలోని సర్పాలు అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో మానసదేవి భక్తులను అస్తీకుని ద్వారా సర్పాలను ఆహుతి నుంచి కాపాడి పూజలు అందుకోవడం విశేషం. సంతానం కోసం తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవు పాలు,పండ్లు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment