Categories
Nemalika

మాటలు మల్లెపువ్వుల పరిమళంలా వుండాలి.

నీహారికా,

అక్షరాలు పెర్చుకొంటు, అచ్చం మల్లె బెండు లాంటి పరిమళం వచ్చేలాగ మాట్లాడటం ఒక ఆర్ట్. మధురంగా మాట్లాడటం ఒక కళ. చక్కగా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్న వేళ, అప్రియులు మాట్లాడకూడదు. ఎలాగంటే “ఎన్ని ప్రమాదాలు ప్రపంచంలో ఇప్పుడు మనం కూర్చున్న ఎ.సి గదిలో మంటలోచ్చాయినుకో, ఒక్కళ్ళం మిగలం”. అన్నారనుకో, ఇక అక్కడ కబుర్లు సాగుతాయి. ఇవి వస్తావాలు కావొచ్చు. కానీ ఆ సందర్భ ప్రేలాపన. మాటలు రాళ్ళ వాసన కురిసినట్లు వుండటం అంటే ఇదే. అంచేత నాలుక ఎప్పుడూ తియ్యగానే మాట్లాడాలి. మంచి మాటలు వినాలంటే మంచి మాటలు మాట్లాడాలి. అంతే గానీ నేను ముక్కు సూటిగా మాట్లాడతాను. నాకు ముఖ ప్రీతి మాటలు రావు అనే వాళ్ళు, ఎదుటివాళ్ళు అలాగే మాట్లాడితే భరించగలరా? అందుకే మనం వాడే భాష, కుదుర్చుకునే పదాలు సంగీతంలా వినిపించ పోయినా కర్ణకఠోరంగా వుండదు, ప్రియంగా వుండాలి.

Leave a comment