ఎంతో సమయం ఆఫీస్ ల్లో గడుపుతూ ఉంటారు. సహోద్యోగులతో మాట్లాడుతూ ఉండే సమయం ఎక్కువగానే ఉంటుంది. వారితో ఎంతో శ్రద్దతో , జాగ్రత్తతో మాట్లాడితేనే బంధం బలంగా ఉంటుంది. ఎంతో సాన్నిత్యం ఉన్నప్పటికీ వాదనలకు తెరతీసే విషయలు ఆదిలోనే తుంచివేయాలి. రాజకీయాలు అస్సలు చర్చించకూడదు. అలాగే జీతాల విషయం కూడా చర్చకు రానివ్వకూడదు. జీతం గురించి బాస్తో తప్ప సహా ఉద్యోగులతో అస్సలు చర్చలు పెట్టకూడదు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మాట్లాడ వద్దు. ఈ అంశం ఒక్కొసారి ఉద్యోగ భద్రతను కూడా తగ్గిస్తుంది. ద్వందార్థాలు వచ్చే హస్య సంభాషణలు కూడా మాట్లాడి అవతలి మనిషి దృస్టిలో దిగ జారకూడదు. మాటలు మంచి ముత్యాలవంటివి.

Leave a comment