పెళ్లిళ్లు,ప్రత్యేక సందర్భాల కోసం పాదరక్షలు బ్యాగ్ లు సిల్క్, వెల్వెట్, శాటిన్, వేగన్, లెదర్ తో రూపొందిస్తున్నారు. వాటిపైన మోటిఫ్ జర్దోసీ, మోతీ,జారీ,థ్రెడ్ వర్క్ చాలా అందంగా ఉంటుంది. ఈ మాచింగ్ డిజైనర్ షూస్ ఇప్పుడు కొత్త ట్రెండ్. పెళ్లిళ్లలో అయితే లెహంగా పైన ఉన్న ఎంబ్రాయిడరీ తోనే వరుడి ఇంటి పేరు వధూవరుల పేర్ల ను బ్యాగ్ ల పైన డిజైన్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ పట్ల ఎంత శ్రద్ధ ఉందో పాదరక్షల పైన కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారు.  మెరిసే బ్రైడల్ లెహంగా లకు ధీటుగా డిజైనర్ పాదరక్షలు కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఉంది ఇప్పుడీ డిజైన్స్ సాధారమైన పాదరక్షల పైకి వచ్చాయి. డ్రెస్ మ్యాచింగ్ క్లచ్ లు పాదరక్షలు ఇప్పుడు కొత్త ట్రెండ్.

Leave a comment