ఇప్పుడు నగరానికి కొత్త  కలెక్టర్ రావాలి వారు వచ్చి నగరాన్ని అర్థం చేసు కొనేందుకు కొంత సమయం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో అదంతా ఇబ్బందే అందుకే నేను సెలవు కాన్సిల్ చేసుకొని విధుల్లోకి వచ్చానంటున్నారు. విశాఖ పట్టణం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి.సృజన. ఆమె 22 రోజుల క్రితం మగబిడ్డ కు జన్మనిచ్చారు. ప్రసూతి సెలవులో ఉన్నారు. ఇంతలో కరోనా కల్లోలం మొదలైంది. అత్యవసర సమయంలో తనసేవలు ప్రజలకు ఉపయోగ పడతాయనే ఉద్దేశ్యం తో సెలవు రద్దు చేసుకొని విధులకు హాజరయ్యారు సృజన. మూడు రోజులుగా వీడియో,టెలి కాన్ఫెరెన్స్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. నాలుగు గంటలకోసారి బిడ్డను చూసుకొని తిరిగి విధుల్లో నిమగ్నమైన ఈమెకు అభినందనలు వెల్లువెత్తాయి.

Leave a comment