పిల్లలకు లెక్కలు సులువుగా అర్థం అయ్యేందుకు వీలుగా సరదా లెక్కల పుస్తకాలు రాసి గణిత మేధావిగా గుర్తింపు పొందారు డాక్టర్ మంగళా నార్లికర్ గణితంలో కీలక శాఖలైనా కాంప్లెక్స్ అనాలసిస్ అనలిటికల్ జామెంట్రీ నంబర్ థియరీ, ఆల్ జీబ్రా లలో విశేష కృషి చేశారు. మహారాష్ట్ర పాఠ్య పుస్తకాల ప్రచురణ సంస్థ బాలభారతి తో కలిసి పిల్లల కోసం విశేషంగా సులభ లెక్కల పుస్తకాలు రాశారు. బాల భారతీ డైరెక్టర్ గా పాఠాలలో సులభ పద్ధతులు ప్రవేశపెట్టారు.మంగళా నార్లికర్ భర్త జయంత్ నార్లికర్ ప్రభుత్వ సైంటిస్ట్. 77 సంవత్సరాల ఈ గణిత మేధావి ప్రస్తుతం పూణేలో నివశిస్తున్నారు.

Leave a comment