చిన్న వయసు నుంచే మతిమరపు మాట వినిపిస్తోంది. దేన్నయినా మరచిపోవటం, గుర్తు పెట్టుకోలేకపోవటం ఇవన్నీ వార్ధక్య లక్షణాలు మాత్రమే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నమతిమరుపు సమస్య అయితే ఏరోబిక్స్ తో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.అంతేకాదు ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది ఆక్సిజన్ సరఫరా వృద్ధి అవుతోంది. ఏరోబిక్స్ వ్యాయామ సమయంలో జ్ఞాపక శక్తి కి సంబంధించిన మెదడు భాగాలకు రక్త సరఫరా పెరిగిందనీ, తద్వారా ఆక్సిజన్ శాతం కూడా పెరిగిందనీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మతిమరుపు వస్తోంది అని గుర్తించ గానే ఏరోబిక్స్ మొదలు పెట్టండి అంటున్నారు.

Leave a comment