డోరో డంగో అని జపాన్ లో ప్రాచీన కాలం నుంచి వస్తున్న కళ. వేర్వేరు రంగుల్లో ఉన్న బంకమట్టి తడిపి గుండ్రంగా నునుపుగా చేసి ఎండబెడతారు. తర్వాత పొడి మట్టి జల్లించి ఆ పిండి లాంటి మట్టిని ఈ బంతుల పైన పోస్తూ రాని బంతులకు అంటుకునేలా రుద్దుతారు.
ఈ మెత్తని మట్టితో ఇవి ఎంతో నునుపుగా పట్టుకుంటే జారేలా తయారవుతాయి. విటిని పాత బుట్టతో బాగా పాలీష్ చేస్తే నునుపు గోలీల్లా అవుతాయి మిషన్ తో తయారు చేసినట్లు. ఈ ఆర్ట్ వల్ల ఏకాగ్రత పెరుగుతుందని పిల్లల చేత స్కూళ్లో ఈ బంతులను చేయిస్తూ ఉంటారు. ఇవన్ని ఎలా చేయోచ్చు ఆన్ లైన్ సెర్చ్ చేసి చూడోచ్చు. ఎక్కడెక్కడ ఎలాంటి కలలున్న పిల్లలకు పరిచయం కావాలి కదా. పల్లెటూర్లలో బంకమట్టితో పిల్లలు బొమ్మలు చేసేవాళ్ళు కదా.

Leave a comment