మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే సహజ ఎరువులో కాఫి పొడి కలిపితే వాటికి నత్రజని లోపం రాకుండా వుంటుంది. అంటే కానీ నత్తలు, చిన్ని చిన్ని పురుగులు చేరవు మొక్క మొదట్లో కాఫి పొడి వేస్తె ఆ వాసనకి పిల్లులు మట్టిని తవ్వకుండా వుంటాయి. గులాబీ మొక్కలు చేక్కగా ఎదగాలంటే మట్టిలో ఆమ్ల స్వభావం వుండాలి. కాఫి పొడి మట్టికి ఆ గుణాన్ని ఇస్తుంది. దీన్ని మొక్క కుదురులో చల్లాలి. రెండు కప్పుల వాడేసిన కాఫి పొడిని ఒక బకేట్ నీళ్ళల్లో కలిపి రాత్రంతా అలా వదిలేసి ఆ నీటిని తెల్లారి మొక్కల పై జల్లితే క్రిమి నాసనిగా ఉపయోగ పడతాయి. మట్టిలో కాఫి పొడిని బాగా కలిపి మొక్కలకు వేస్తె కలుపు మొక్కలు రావు. ఎండాకాలంలో తేమ పోగోట్టుకుని మొక్కలు వాడిపోకుండా కూడా కాఫి పొడి కాపాడుతుంది.
Categories
WoW

మట్టి లో ఆమ్ల స్వభావం పెంచే కాఫి పొడి

Leave a comment