Categories
విరిసిన పూవ్వులు,గులాబీలు,మందారాలు,చా మంతులతో కళకళలాడే చక్కని కుండీలు ఆఫీస్ రూమ్స్ లో ,ఇళ్ళల్లో అందంగా ఉంటాయి . అవి ఎప్పటికి వాడిపోనీ మట్టిపూల రూపంలో వస్తున్నాయి ఇప్పుడు . పాలిమర్ క్లె తో తయారైన మట్టి పూలు ఎంత దగ్గర నుంచి చుసినా అవి నిజం కావని అనుకోలేము . గులాబీ ,మందారం,చామంతి ,మల్లె ,లిల్లీ ,దేవగన్నేరు ,ఆర్నిడ్ లాంటి అన్ని రకాల పూలతో మొక్కల్ని,క్రోటన్ మొక్కల్ని తయారుచేస్తున్నారు . పాలీ విలైన్ క్లోరైడ్ లో జంక్ ఆక్సాయిడ్ కాయొలీన్ కయోలిన్ వంటి వాటిని కలిపి చేసిన ఈ మట్టి మార్కెట్ లో దొరుకుతుంది . సహజమైన మెరుపు వచ్చేందుకు ఈ మట్టిలో ఎన్నో పదార్దాలు కలుపుతారు . ఈ మట్టిని చేతులతో పల్చగా నలిపి పూల రెక్కలుగా చేసే కళ థాయిలాండ్ నుండి వచ్చింది .