క్లే పెబర్స్… అంటే మట్టి ఉండలు. మట్టి రాళ్ళూ అని అంటారు. ఇవి కుండీల్లో పోసి మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి కావలసినంత నీరు పీల్చుకుని కుండీల్లో నీరు నిల్వ లేకుండా చేస్తాయి. ఈ మట్టి ఉండలు రంధ్రాలతో ఉంటాయి. మొక్క వేళ్ళు గాలి పోసుకుంటాయి. నీళ్ళు పీల్చుకుని మొక్కకు కావల్సినంత నీటిని ఇస్తాయి. ఇటుకల్ని కాల్చినట్లే వీటిని కూడా భరీ మెషీన్ లో బాగా ప్రాసెస్ చేసి అత్యధిక ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర తయ్యారు చేస్తారు. మట్టిలో ఆక్సిజన్ ఎక్కువగా వుంటుంది కనుక మొక్క వెళ్ళు వేగంగా వాటిల్లో నటుకుంటాయి. కుండీల్లో మొక్కలు పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పర్యావరణ హితంగా వుండే క్లేపెబల్స్ కోసం చూడొచ్చు. మట్టిలేకుండా మొక్కలు పెంచే పరిశ్రమ ఇది. మొక్కను నాటి ముందే సుమారు ఆరేడు గంటలు ఈ మట్టి ఉండలు నాన బెడితే నాని ఉబ్బుతాయి. నీటిలో కొబ్బరి పీచు, పీట్ మాన్, పెర్లైట్ వంటి వాటితో కూడా కింద తడికాకుండా టెర్రస్ పైన చాల్కనాల్లో ఉద్యానవనం పెంచుకోవచ్చు.

Leave a comment