కొన్ని మసాజ్ లు ఎంతో మేలు చేస్తాయి. తలకు నూనె పట్టించి మాడును మునివేళ్ళతో మసాజ్ చేస్తే రంద్రాలు ఉద్దీప్తం అయిఆరోగ్యవంతమైన సహజ నూనె ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల మాడు సిరోజాలు ఆరోగ్యంగా బావుండి జుట్టు పెరుగుతుంది. రెగ్యులర్ గా వాడె స్టయిలింగ్ ఉత్పత్తులు ప్రయోగాలతో సిరోజాలకు హాని కలుగుతుంది. జుట్టు రాలిపోవడం అందరికి ఎదురయ్యే సమస్య. జుట్టు పల్చబడి మాడు కనబడుతూ వుంటుంది. మసాజింగ్ తోనే సిరోజాలకు మాడుకు పోషకాలు లభిస్తాయి. చర్మం కావలసినంత సేబంను ఉత్పత్తి ఉత్పత్తి చేయకపోతే చర్మమే కాదు, మాడు కూడా పోదిబారిపోతుంది. ఆయిల్ మసాజ్ వల్ల మాడు పొడిబారడం తగ్గి సహజమియన్ నూనెను భర్తీ చేసుకుంటుంది. హెయిర్ క్లినిక్స్ లో అత్యవసర నూనెలు అరోమా ఆయిల్స్ తో మసాజ్ చేస్తారు. మసాజ్ ప్రక్రియతో ప్రెషర్ పాయింట్స్ ని ఉత్తేజ పరుస్తారు. దీనితో వత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జుట్టు కుదుళ్ళు రిలాక్స్ అవ్వుతాయి. ఇంట్లో కూడా కాస్త వేడి చేసిన కొబ్బరి నూనె తో జుట్టు కుదుళ్ళు రేలాక్స్ అవ్వుతాయి. ఇంట్లో కూడా కాస్త వేడి చేసిన కొబ్బరి నూనెతో జుట్టు కుదుళ్ళ వరకు వేళ్ళతో నెమ్మదిగా రుద్దుతూ మసాజ్ చీసుకున్నా ఇదే ఫలితం వుంటుంది.

Leave a comment