షాపింగ్ కు వెళుతున్నారా అయితే ఏం కొనాలో రాసుకున్నారా, ఎంత కొనాలో అంతే డబ్బు తీసుకెళుతున్నారా? మీరు ఆశ్చర్యంగా చూస్తే పొరపాటు చేస్తున్నట్లే. షాపింగ్ మాల్ అంటే అదో మాయా ప్రపంచం. ఆ మాయా ద్వీపంలోకి వెళ్ళి సరిగ్గా మనం అనుకున్నవెమో అవే కొనుక్కుని రావటం గొప్ప ఆర్టే, ఆకర్షనియంగా కనిపించే ప్యాక్ లు, ఆఫర్లు రా రమ్మని పిలుస్తాయి. చేతిలో క్రెడిట్ కార్డు ఉందా ? ఇక దభేలు మని ఆ మాయా ద్వీపంలోకి పడిపోతాం. అందుకే సరైన ఆర్ధిక ప్రణాళికతో ఇంటికి కావలిసిన వస్తువులు హోల్ సేల్ లో ఒకేసారి కొనటం బెస్ట్, ఆఫర్ చూడండి ఒకటి కొంటె రెండు ఉచితం అంటే మంచిదైతే పర్లేదు కాని పదివేలు బిల్లు చేస్తే 500 ఓచర్ లేదా వెయ్యి రూపాయల ఓచర్ ఫ్రీ ఇస్తే ఆ ఓచర్ తో మళ్ళి అదే షాపులో ఏదో ఒకటి కొనుక్కోవాలి. రేబాన్ గ్లాసులు, బ్రాండెడ్ దుస్తులు, ఫాస్ట్ ట్రాక్ వాచీలకు ఆఫర్లు ఎక్కువే ఉంటాయి. మనకు అవసరమా కాదా అని విచక్షణ ఉండటం ముఖ్యం. మన స్టేటస్ కోసం ఆర్ధికపరిస్థితి ఆమోదించకపోయినా వస్తువులు కొంటాం. ఈ బలహీనత తర్వాత కుటుంబం పై బరువు మోపుతుంది. ఖర్చుతో కూడిన ఆనందం స్థానంలో సిపుల్ ఆనందాన్ని ఆస్వాదించటం కూడా కుటుంబానికి అవసరమే. ఆర్ధిక క్రమశిక్షణ చాలా ముఖ్యం.

Leave a comment